2025-02-21 06:18:20.0
టీటీడీ విజిలెన్స్‌ను ఆశ్రయించిన పూణె భక్తుడు ప్రకాశ్.. కేసు నమోదు చేసిన పోలీసులు
తిరుమలలో వీఐపీ దర్శనం పేరుతో భక్తులను దళారులు మోసం చేశారు. స్వామి వారి దర్శనం కల్పిస్తామని పూణె భక్తుడు ప్రకాశ్ నుంచిరూ. 70 వేలు వసూలు చేసిన దళారులు శ్రీవాణి దర్శనం పేరుతో రూ. 300 ప్రత్యేక దర్శనానికి పంపారు. మోసపోయామని గ్రహించిన భక్తుడు టీటీడీ విజిలెన్స్‌ను ఆశ్రయించాడు. దళారులపై తిరుమల ఒకటో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. డైక్ టూర్స్ కార్పొరేషన్ కు చెందిన చంద్రలేఖ గోపాల్ తో పాటు ట్రావెల్ ఏజెంట్లు శరవణన్, శరత్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Brokers cheated,Devotees,In the name of VIP darshan,Case Filed,TTD