2025-01-29 06:47:03.0
మహా కుంభమేళాలో తొక్కిసలాటపై విపక్ష నేతల ఫైర్
https://www.teluguglobal.com/h-upload/2025/01/29/1398496-stampede-rahul-akhilesh.webp
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ ఘటనలో 20 మందికిపైగా మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఘటనపై స్పందించారు. పాలనా యంత్రాంగం సాధారణ భక్తుల గురించి కాకుండా వీఐపీల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించడమే దీనికి కారణమని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనలో అనేకమంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం, గాయాలపాలవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. పాలనా యంత్రాంగం సాధారణ భకతుల గురించి కాకుండా.. వీఐపీల తరలింపుపై ఎక్కువ దృష్టి సారించడమే ఈ విషాద సంఘటనకు కారణం. ఈ మహా కుంభమేళాలో మహాస్నానాలు ఇంకా అనేకం జరగాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థను మెరుగుపరచాలి. వీఐపీ సంస్కృతిని అరికట్టి.. సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వాలని రాహుల్ రాసుకొచ్చారు.
కుంభమేళా నిర్వహణ నుంచి యోగిని తొలిగించాలి:అఖిలేశ్
కుంభమేళాలో జరిగిన ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా స్పందించారు. దీని నిర్వహణ నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను తొలిగించాని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నిర్వహణ లోపమే ఈ ఘటనకు కారణమన్నారు. కుంభమేళా నిర్వహణను సైన్యానికి అప్పగించాలన్నారు. ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ యోగి రాజీనామా చేయాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు.
Kumbh Mela Stampede,Due to VIP culture,Rahul Gandhi,Akhlesh Yadav,Fire on Yogi Adityanath,Uttar Pradesh