https://www.teluguglobal.com/h-upload/2022/08/16/500x300_372770-waterfalls.webp
2022-08-16 09:15:05.0
వాటర్ ఫాల్స్‌ను ఎంజాయ్ చేయడానికి వర్షాకాలమే సరైన సీజన్
వాటర్ ఫాల్స్‌ను ఎంజాయ్ చేయడానికి వర్షాకాలమే సరైన సీజన్. ఈ సీజన్‌లో జలపాతాలు ఉప్పొంగుతుంటాయి. వాటర్ ఫాల్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. సిటీకి దగ్గర్లో కూడా అందమైన వాటర్ ఫాల్స్ కొన్ని ఉన్నాయి. ఎక్కడంటే..
హైదరాబాద్ సిటీకి దగ్గర్లోనే నానాజీపూర్ జలపాతం ఉంది. ఇది వీకెండ్‌కు పర్ఫెక్ట్ స్పాట్. శంషాబాద్‌కు15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నానాజీపూర్ వాటర్‌ఫాల్.. వర్షాల ధాటికి పొంగిపొర్లుతోంది. సిటీకి ఎంతో దగ్గరగా ఉండడం వల్ల వీకెండ్స్‌లో ఇక్కడ చాలా సందడి కనిపిస్తుంది. పాలమాకుల్ చెరువు నిండి అక్కడి నుంచి హిమయాత్ సాగర్‌కు వెళ్లే వర్షపు నీళ్లు మధ్యలో ఉండే వెడల్పాటి కొండరాళ్ల మీదుగా జాలువారుతుంటాయి. ఇలా సహజంగా ఏర్పడిన నానాజీపూర్ జలపాతం.. చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది.
హైదరాబాద్‌కు దగ్గర్లో మరో అందమైన జలపాతం ఉంది. అదే ‘అంతరగంగ’ జలపాతం. ఇది సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్‌తో పాటు, కొండలపై ట్రెక్ చేయొచ్చు కూడా. హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై రామోజీ ఫిల్మ్ సిటీ, అబ్దుల్లాపూర్‌మెట్ దాటాక ఎడమవైపు వెళ్తే రంగారెడ్డి జిల్లా కవాడి పల్లి గ్రామం వస్తుంది. ఇక్కడి అటవీ ప్రాంతంలోనే అంతరగంగ జలపాతం ఉంది. వీకెండ్స్‌లో ఇక్కడికి చాలామంది వెళ్తుంటారు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఈ జలపాతం దగ్గర మరింత సందడి ఉంటుంది.
Waterfall,Waterfalls in Hyderabad,Hyderabad,Weekend Getaways,Nanajipur Waterfalls