https://www.teluguglobal.com/h-upload/2024/04/30/500x300_1323674-weight-gain.webp
2024-04-30 21:16:03.0
జంక్ ఫుడ్, లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్‌తో పాటు కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ కూడా త్వరగా వెయిట్ గెయిన్ అయ్యేలా చేస్తాయని పలు స్టడీల్లో తేలింది. అలాంటి ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒబెసిటీ అనేది ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య. అయితే చాలామందికి తాము ఎందుకు బరువు పెరుగుతున్నారో తెలియదు. జంక్ ఫుడ్, లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్‌తో పాటు కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ కూడా త్వరగా వెయిట్ గెయిన్ అయ్యేలా చేస్తాయని పలు స్టడీల్లో తేలింది. అలాంటి ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునేవాళ్లు డైట్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. బరువు తగ్గించే ఆహారం తీసుకోవడంతోపాటు బరువు పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఫుడ్ కాంబినేషన్స్ ను అస్సలు తీసుకోకూడదని డాక్టర్లు చెప్తున్నారు.
ఫుడ్‌తో డ్రింక్స్
ఫుడ్‌తో కలిపి డ్రింక్స్ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. చాలామంది రెస్టారెంట్లలో తింటూనే కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అలాగే మరికొంతమంది స్నాక్స్ తింటూ టీ, కాఫీలు తాగుతుంటారు. ఇలాంటి ఫుడ్ కాంబినేషన్స్ వల్ల శరీరం ఎక్కువ కొవ్వులు, షుగర్స్ పోగుచేసుకుంటుంది. తద్వారా మరింత బరువు పెరుగుతారు.
ఆలూతో అన్నం
బంగాళాదుంపలు, ఇతర దుంప జాతికి చెందిన కూరగాయల్లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే కార్బోహైడ్రేట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని వైట్ రైస్‌తో కలిపి తినడం ద్వారా మరిన్ని ఎక్కువ క్యాలరీలు శరీరానికి అందుతాయి. ఈ కాంబినేషన్‌ను తరచూ తీసుకోవడం ద్వారా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది.

పాలు, అరటి
పాలు, అరటి పండుని కలిపి తీసుకోవడం లేదా వెంటవెంటనే తీసుకోవడం ద్వారా శరీరంలోని డైజెషన్ స్లో అవుతుంది. తద్వారా క్రమంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ కాంబినేషన్‌ను అవాయిడ్ చేయాలి.
ఇక వీటితోపాటు ఓట్స్‌తో డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకోవడం ద్వారా అధిక క్యాలరీలు అంది బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బ్రెడ్ విత్ జామ్, ఫ్యాట్స్ విత్ ప్రొటీన్స్, పప్పు విత్ చికెన్, చీజ్ విత్ ఎగ్స్ వంటి ఫుడ్ కాంబినేషన్లు కూడా త్వరగా బరువు పెరిగేలా చేస్తాయి.

Weight Gain,Weight Gain Diet,Food,weight gain food
Weight Gain, Weight Gain diet, eat, gain weight, telugu news, telugu global news, weight gain food items, weight gain food, వెయిట్ గెయిన్
https://www.teluguglobal.com//health-life-style/weight-gain-did-you-know-that-if-you-eat-them-together-you-will-gain-weight-1025974