https://www.teluguglobal.com/h-upload/2022/09/15/500x300_397666-back-pain.webp
2022-09-15 10:38:56.0
ఈరోజుల్లో చాలామందికి వెన్ను నొప్పి అనేది లైఫ్‌స్టైల్‌లో భాగంగా మారింది. దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్న వాళ్లు చాలామందే ఉన్నారు.
ఈరోజుల్లో చాలామందికి వెన్ను నొప్పి అనేది లైఫ్‌స్టైల్‌లో భాగంగా మారింది. దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ఈ వెన్నునొప్పి కారణంగా కూర్చోవడం లేదా నిలబడడం కష్టంగా ఉంటుంది. అసలీ వెన్నునొప్పి ఎందుకొస్తుంది? దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
వయసు పెరిగే కొద్దీ వెన్నునొప్పి మొదలవుతుంటుంది. వెన్నెముక లోపల మృదులాస్థి సన్నబడడం. వెన్నుపాము కుంచించుకుపోవడం వల్ల వెన్ను నొప్పి వస్తుంటుంది. అలాగే డిస్క్ సమస్యలు కూడా వెన్నునొప్పికి కారణమవుతాయి. భరించలేని కండరాల నొప్పి, సయాటికా, గాయాలు, పడిపోవడం, పగుళ్ల కారణంగా చాలామందికి విపరీతమైన వెన్నునొప్పి వస్తుంటుంది.
బరువులను ఎత్తడం, ఎక్కువ సేపు వంగి పని చేయడం, శరీరాన్ని అతిగా సాగదీయడం, గంటల పాటు ఒకే భంగిమలో కూర్చోవడం లాంటివి వెన్నునొప్పికి కారణాలవ్వొచ్చు. వెన్ను నొప్పి వచ్చిందంటే దానితో పాటు మరికొన్ని సమస్యలు కూడా మొదలవుతాయి. వెన్నునొప్పి కారణంగా అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. అలాగే తరుచూ జ్వరం వస్తుంటుంది. వెన్నులో వాపు, నొప్పి మొదలవుతాయి. కాళ్లలో నొప్పి, మూత్రవిసర్జనలో ఇబ్బందులు వస్తాయి. తీవ్రమైన అలసట వేధిస్తుంది.వెన్ను నొప్పిని తగ్గించేందుకు మందులు, ట్రీట్మెంట్స్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎన్నో రకాల ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
వెన్ను నొప్పి రాకుండా ఉండాలంటే రోజూ స్ట్రెచింగ్, ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేయాలి. శరీరాన్ని సరైన భంగిమలో ఉంచాలి. ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. పోషకాహారాన్ని తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటివాటికి దూరంగా ఉండాలి. వెన్నెముకపై భారం పడే పనులు చేయకూడదు.
back pain,Health Tips
back pain, What causes back pain, what causes back pain in females, exercise of back pain, back pain from yoga, Telugu news, telugu global news, telugu global, latest telugu news, వెన్ను నొప్పి, స్ట్రెచింగ్, ఏరోబిక్స్
https://www.teluguglobal.com//health-life-style/what-causes-back-pain-342660