https://www.teluguglobal.com/h-upload/2023/12/10/500x300_869697-weight-loss.webp
2023-12-10 06:09:29.0
బరువు తగ్గడం కోసం చాలామంది నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి డైట్‌లో చేర్చుకుంటారు. అయితే వీటిలో కూడా వేగంగా బరువు తగ్గించేవి కొన్ని ఉన్నాయి.
బరువు తగ్గడం కోసం చాలామంది నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి డైట్‌లో చేర్చుకుంటారు. అయితే వీటిలో కూడా వేగంగా బరువు తగ్గించేవి కొన్ని ఉన్నాయి. అసలు డ్రై ఫ్రూట్స్‌లో ఏవి బెస్ట్? వెయిట్ లాస్ కోసం నట్స్‌ను ఎలా తినాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
తక్కువ క్యాలరీలు.. ఎక్కువ పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్. వీటిలో అన్నిరకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. క్రమం తప్పకుండా నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్‌ను తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేగంగా బరువు తగ్గేలా చేస్తాయి.
బాదం
వెయిట్ లాస్ కోసం తప్పక తినాల్సిన నట్.. బాదం. బాదంతో అన్ని పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. వేగంగా బరువు తగ్గాలంటే రోజూ ఓ పది బాదం పప్పులను ఆరు గంటల సేపు నానబెట్టి తీసుకోవాలి.
ఎండు ద్రాక్ష
బరువు తగ్గించే మరో అద్భుతమైన డ్రై ఫ్రూట్ ఎండు ద్రాక్ష. ఇవి తక్షణ శక్తినివ్వడంతో పాటు ఆకలి తగ్గేలా చేస్తాయి. ముఖ్యంగా ఎండు ద్రాక్షతో ఒత్తిడి తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. బరువు తగ్గాలంటే ఇది కీలకం.
అంజీర్
ఎండిన అంజీరలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉండే మినరల్స్ నరాలను బలంగా ఉంచుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. గుండెజబ్బులకు, క్యాన్సర్‌కు, వెయిట్ లాస్‌కు ఇది బెస్ట్ డ్రై ఫ్రూట్.
డేట్స్
మామూలు డేట్స్ లేదా ఎండు ఖర్జూరం ఏది తిన్నా రక్తపోటు తగ్గుతుంది. అంతేకాదు, మలబద్దకం తగ్గి డైజెషన్ మెరుగుపడుతుంది. డేట్స్‌తో తక్షణ శక్తితో పాటు అన్ని రకాల మినరల్స్ లభిస్తాయి. రోజుకి నాలుగైదు డేట్స్ తింటే వెయిట్ లాస్ ప్రాసెస్ వేగవంతం అవుతుంది. అయితే ఎండు ఖర్జూరాన్ని నానబెట్టి తినడం మంచిది.
జీడిపప్పు
జీడిపప్పులో ప్రొటీన్స్ ఎక్కువ. మినరల్స్, విటమిన్స్‌తో నిండిన జీడిపప్పు ఇమ్యూనిటీని పెంచుతుంది. బీపీని తగ్గిస్తుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ కోసం ఇది కూడా మంచి ఆప్షన్. అయితే జీడిపప్పులను పచ్చిగా కంటే లైట్‌గా వేగించి తినడం మంచిది.
Weight Loss Tips in Telugu,Weight Loss,Dry Fruits,Health Tips
Weight Loss, Weight Loss Tips in Telugu, Telugu News, Health, Health Tips, Telugu News, Telugu Global News, dry fruits
https://www.teluguglobal.com//health-life-style/weight-loss-these-5-dry-fruits-are-best-to-lose-weight-979976