https://www.teluguglobal.com/h-upload/2022/09/03/500x300_389962-33f6684f-ffcf-4398-9661-c914f64b9f8a.webp
2022-09-03 14:57:37.0
గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల నెలసరిలో వచ్చే అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. రోజంతా వెచ్చని నీళ్లే తాగుతూ ఉంటే నెలసరి సమయంలో కలిగే అలసట, చిరాకు లాంటివి తగ్గుతాయి.
మనకు ఆహారం ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే అవసరం. అయితే ఇతర సీజన్లలో మామూలు నీళ్లు తాగినా.. వానాకాలంలో మాత్రం వేడి నీళ్లు తాగడం మంచిదని చెప్తున్నారు డాక్టర్లు. వేడి నీళ్లతో ఎన్ని ప్రయోజనాలున్నాయంటే..
రోజుకు రెండు లీటర్ల గోరు వెచ్చని నీళ్లు తాగడం ద్వారా శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. సీజనల్ ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాప్తి చెందకుండా ఉంటాయి.
గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల నెలసరిలో వచ్చే అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. రోజంతా వెచ్చని నీళ్లే తాగుతూ ఉంటే నెలసరి సమయంలో కలిగే అలసట, చిరాకు లాంటివి తగ్గుతాయి.
గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకుంటే మొటిమలు రావు. చర్మం తాజాగా ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
రోజూ ఉదయాన్నే లీటరు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ముఖంలో ముడతలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మసరం లాంటివి కలుపుకుని తాగడం ద్వారా సులువుగా బరువు తగ్గొచ్చు.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లు తాగితే బద్ధకం తగ్గి ఉల్లాసంగా ఉంటుంది. ముక్కు దిబ్బడ, గొంతు సమస్యలు, శ్వాస ఇబ్బందులు నయమవుతాయి.
వెచ్చటి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని అవయవాలన్నీ యాక్టివేట్ అవుతాయి .కండరాలు వదులుగా ఉంటాయి. నరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
వేడినీళ్లు తీసుకోవడం ద్వారా డైజెషన్ ప్రాబ్లెమ్స్ దరిచేరవు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.
Doctors,Drink,Hot Water,Monsoon
Doctors, Better, Drink, Hot Water, Monsoon, గోరు వెచ్చని నీళ్లు తాగడం, వేడి నీళ్లు ఎందుకు తాగాలంటే, నీళ్లు తాగడం
https://www.teluguglobal.com//health-life-style/doctors-say-that-it-is-better-to-drink-hot-water-during-monsoon-338683