https://www.teluguglobal.com/h-upload/2024/11/08/1375904-venu-swamy.webp
2024-11-08 08:34:25.0
ఈనెల 14న విచారణకు రావాలని ఆదేశం
వివాదాదస్పద జోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 14న విచారణకు రావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం చేసుకున్న వాళ్లు ఎక్కువ కాలం కలిసి ఉండరని వేణుస్వామి చేసిన కామెంట్స్ పై మహిళ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగా, హైకోర్టును ఆశ్రయించి ఆ నోటీసులపై స్టే తెచ్చుకున్నాడు. ఇటీవల హైకోర్టు స్టే ఎత్తేయడంతో మహిళ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో విచారణకు హాజరుకావడం మినహా వేణుస్వామికి ఇంకో అవకాశం లేకుండా పోయింది.
Venu Swamy,Nagachaitanya,Shobhitha Dulipalla,State Women Commission,Issued Notices