2025-02-17 14:45:29.0
రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు సాగు నీటి విడుదలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. శ్రీశైలం నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ తో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, నీటి వినియోగం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని.. సాగునీటికి, తాగు నీటికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక చొరువ తీసుకోవాలని తెలిపారు.
CM Revanth Reddy,Drinking water,summer,Chief Secretary Shanti Kumari,Minister Uttam Kumar Reddy,Srisailam Nagarjunasagar,Essarsp,Telangana Goverment,Hyderabad,CM Revanth reddy,Congress party