వేసవి

2023-05-17 07:44:04.0

https://www.teluguglobal.com/h-upload/2023/05/17/765204-summer.webp

కాలం కదలదు,

గుహలో పులి

పంజా విప్పదు,

చేపకుగాలం తగలదు.

చెట్లనీడ ఆవులు

మోరలుదింపవు,

పిల్లిపిల్ల బల్లిని చంపదు.

కొండమీద తారలు మాడెను

బండమీద కాకులు చచ్చెను.

కాలం కదలదు,

గుహలో పులి

పంజా విప్పదు,

చేపకు గాలం తగలదు.

ఎండు టాకులు

సుడిగాలికి తిరిగెను

గిర్రున వడగొట్టిన

బిక్షుకి అరచెను వెర్రిగ

పంకాకింద శ్రీమంతుడు

ప్రాణంవిడచెను,

గుండెకింద

నెత్తురు నడచెను

– తిలక్

Summer,Tilak,Telugu Kavithalu