వైఎస్‌ఆర్‌ జిల్లా పేరు మార్చండి

2024-10-04 13:56:30.0

ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ

https://www.teluguglobal.com/h-upload/2024/10/04/1366170-ysr-kadapa-dist.webp

వైఎస్‌ఆర్‌ జిల్లా పేరు మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్ర మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్‌ శుక్రవారం లేఖ రాశారు. కడప జిల్లాకు రాయలసీమలో గొప్ప నేపథ్యం ఉందని ఉందని తెలిపారు. దానిని గుర్తించకుండా వైసీపీ ప్రభుత్వం కడప జిల్లా పేరును వైఎస్‌ఆర్‌ జిల్లాగా మార్చిందని వివరించారు. ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న కడప పేరును మళ్లీ పెట్టాలని సూచించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ జిల్లా పేరును వైఎస్‌ఆర్‌ కడప జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.