2025-01-28 12:49:30.0
తేల్చిచెప్పిన ప్రెసిడెంట్ ట్రంప్
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో టెస్లా చీఫ్ ఎలన్ మస్క్‌కు ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారనే వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. అలాంటి ఆఫీస్ ఏది వైట్ హౌస్ ప్రాంగణంలో ఉండదని తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ వెన్నంటి నిలిచిన ఎలన్ మస్క్‌ను పాలనలో భాగం చేశారు. ఆయనను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోవీజీఈ)గా నియమించారు. ఎలన్ మస్క్ బాధ్యతలు నిర్వర్తించే డీవోజీఈ ఆఫీస్‌ను వైట్ హౌస్‌కు పశ్చిమం వైపునకు ఉన్న ఓవల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు మీడియా కథనాలు ప్రసారం చేసింది. వాటిని ప్రెసిడెంట్ ట్రంప్ ఖండించారు. అధ్యక్ష భవనంలోని పశ్చమం వైపున ఏర్పాటు చేస్తున్న ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై చర్చించేందుకు సిద్ధం చేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. తన టీమ్‌లో 25 మంది సభ్యులు ఉన్నందున ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సలహాలు, సూచనలు, వాటి అమలు కోసం ఆ ఆఫీస్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వంలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చుల నియంత్రణే లక్ష్యంగా మస్క్ టీమ్ పని చేస్తుందన్నారు.
White House,USA,President Donald Trump,Elon Musk,DOEG