వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ పురస్కారం

2024-10-07 11:42:56.0

2024 సంవత్సరానికి గాని విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌కు దక్కిన పురస్కారం

వైద్యశాస్త్రంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి ఇద్దరిని వరించింది. విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్‌ పురస్కారం దక్కింది. మైక్రోఆర్‌ఎన్‌ఏ ఆవిష్కరణ, పోస్ట్‌ ట్రాన్‌స్క్రిప్షనల్‌ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రపై పరిశోధనలకు గుర్తింపుగా పురస్కారాన్ని ప్రకటించారు. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం ఈ ప్రకటన చేసింది. 

Nobel Prize in Medicine 2024,Victor Ambros,Gary Ruvkun,win,MicroRNA discovery