వైసీపీకి ప్రతిపక్ష హోదాపై పవన్ సంచలన వ్యాఖ్యలు

2025-02-24 07:50:26.0

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైసీపీ అనడం సరైన విధానం కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు

https://www.teluguglobal.com/h-upload/2025/02/24/1406291-gghsghhh.webp

వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్నారు.11 సీట్లు ఉన్న వైసిపి కి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు అంటూ నిలదీశారు. జనసేన పార్టీ కన్న ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదన్నారు. ఓట్లు శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా రావాలంటే జగన్ జర్మీనీ వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసన సభకు వస్తాం, లేకపోతే ప్రసంగాలను అడ్డుకుంటామనడం సరైన పద్దతి కాదని చెప్పారు. వైసీపీ నాయకులు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం, బాధ్యత ఉందని తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని ఆ విధంగా అడ్డుకోవడం సరికాదన్నారు. అరుపులు కేకలు వేయటం సమంజసం కాదన్నారు. అసెంబ్లీకి వచ్చి గొడవ పెట్టుకోవడం, లో లెవెల్ స్టేటజీ అని అన్నారు. సభకు రావాలి ప్రజా సమస్యలు ప్రస్తావించాలన్నారు.