వైసీపీకి వాసిరెడ్డి పద్మ గుడ్‌బై

2024-10-23 05:48:05.0

పార్టీని నడిపించడంలో, పాలనలో జగన్‌కు బాధ్యత లేదని విమర్శ

https://www.teluguglobal.com/h-upload/2024/10/23/1371629-vasireddy-padma.webp

సీనియర్‌ మహిళా నేత, మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను పార్టీ కార్యాలయానికి పంపించారు. పార్టీని నడిపించడంలో, పాలనలో జగన్‌కు బాధ్యత లేదని ఆమె విమర్శించారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు మెచ్చుకోరని ఎన్నకల తీర్పు స్పష్టం చేసిందన్నారు. జగన్‌ ‘గుడ్‌ బుక్‌’ పేరుతో మరోసారి మోసానికి సిద్ధమయ్యారని చెప్పారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్‌ బుక్‌ కాదు, గుండె బుక్‌ అని పేర్కొన్నారు. 

వైసీపీ పాలనలో జగన్‌ ప్రజలను అన్నివిధాలుగా మోసం చేశారు. ప్రభుత్వ మద్యం పేరుతో పేద ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ ప్రజా సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. ఎన్నో అవమానాలు ఎదురైనా క్రమశిక్షణ కలిగిన నేతగా పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. మహిళలపై జరుగుతున్న దాడులను వైసీపీ రాజకీయంగా వాడుకోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ అనేక దాడులు జరగాయన్నారు. సీఎం హోదాలో జగన్‌ ఎప్పుడూ బాధితులను పరామర్శించలేదన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను ఆయన దృష్టికి తీసుకెళ్లినా కనీస చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు.