2025-02-26 09:37:48.0
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను బుధవారంతెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
మహాశివరాత్రి పర్వదినాన వ్యవసాయ కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేసింది. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేసింది. మొత్తం 18,180 మంది కూలీలకు రూ. 6 వేల చొప్పున జమ చేసింది. ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసింది. ఆ రెండు జిల్లాల్లో దాదాపు 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం చెల్లించింది. మొత్తం 66,240 మంది కూలీల ఖాతాల్లో రూ.39.74 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
Indiramma Atmiya Bharosa Scheme,agricultural labourers,Rangareddy,Mahbubnagar District,Minister Sitakka,National Employment Guarantee