శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన

2025-02-05 05:40:17.0

శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే విమానాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు నిలిపివేశారు. ఇవాళ ఉదయం 05.30 గంటలకు బయల్ధేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే దీనిపై చివరి నిమిషంలో ప్రయాణికులకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సమాచారం ఇవ్వడంలో ఎయిర్‌పోర్టు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

అప్పటి వరకు విమానం కోసం వేచి చూస్తున్న ప్రయాణికులకు చివరి నిమిషంలో అక్కడి సిబ్బంది చెప్పిన కారణంతో వారు మండిపడిపోతున్నారు. దాదాపు 4 గంటలుగా ఎయిర్ పోర్టులోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నామని, దర్శన సమయం దాటిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక తమను వెంటనే తిరుపతి పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Shamshabad Airport,Hyderabad,Tirupati,Tirupati flight,serious difficulties,airlines,Tirupati darshan,delayed,minister Kinjarapu Ram Mohan Naidu