2018-12-11 20:08:35.0
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు అన్నదమ్ములు. అందరిలోకి చిన్న వాడు శత్రుఘ్నుడే! సుమిత్రకూ దశరథ మహారాజుకూ కలిగిన సంతానమే శత్రుఘ్నుడు. లక్ష్మణుని తోడపుట్టిన వాడు. అయిననూ భరతునితో అన్యోన్యత ఎక్కువ. అందుకనే రామలక్ష్మణులని ఎలా కలిపి చెబుతారో భరత శత్రుఘ్నులను అలాగే కలిపి చెబుతారు. దీనికీ కారణం ఉంది. పిల్లలు లేక పుత్రకామేష్టి యాగము నిర్వహించిన దశరథుడు యజ్ఞ పురుషుడిచ్చిన పాయసాన్ని కౌసల్య కైకేయిలకిస్తాడు. కౌసల్య కైకేయి తాము స్వీకరించిన పాయసములో సగము సుమిత్రకు ఇస్తారు. అందువల్ల […]
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు అన్నదమ్ములు. అందరిలోకి చిన్న వాడు శత్రుఘ్నుడే!
సుమిత్రకూ దశరథ మహారాజుకూ కలిగిన సంతానమే శత్రుఘ్నుడు. లక్ష్మణుని తోడపుట్టిన వాడు. అయిననూ భరతునితో అన్యోన్యత ఎక్కువ. అందుకనే రామలక్ష్మణులని ఎలా కలిపి చెబుతారో భరత శత్రుఘ్నులను అలాగే కలిపి చెబుతారు. దీనికీ కారణం ఉంది.
పిల్లలు లేక పుత్రకామేష్టి యాగము నిర్వహించిన దశరథుడు యజ్ఞ పురుషుడిచ్చిన పాయసాన్ని కౌసల్య కైకేయిలకిస్తాడు. కౌసల్య కైకేయి తాము స్వీకరించిన పాయసములో సగము సుమిత్రకు ఇస్తారు. అందువల్ల సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుడతారు. కౌసల్య తాగిన పాయసంతో రాముడూ – మిగతా సగమూ సుమిత్ర తాగడంతో లక్ష్మణుడూ, అలాగే కైకేయి తాగిన పాయసంతో భరతుడూ – మిగతా సగమూ సుమిత్ర తాగడంతో శత్రుఘ్నుడు పుడతారు. అంచేత రామలక్ష్మణులు ప్రాణానికి ప్రాణం కాగా భరత శత్రుఘ్నులు ప్రాణానికి ప్రాణంగా మసలుతారు.
సీతా రాముల వివాహమప్పుడే ఊర్మిళ లక్ష్మణులు – మాండవి భరతులు – వివాహంతోపాటు శ్రుత కీర్తికీ శత్రుఘ్నునికీ వివాహం జరిగింది. శ్రుతకీర్తి ఎవరో కాదు, సీత పినతండ్రి కుమార్తె.
భరతునితో పాటే శత్రుఘ్నుడు – ఏ పని చేసినా, ఎక్కడకు వెళ్లినా, శ్రీరాముని పట్టాభిషేకాన్ని దశరథుడు తలచినప్పుడు కోరకూడని వరాలు కైకేయి కోరినప్పుడు శత్రుఘ్నుడు అయోధ్యలో లేడు. భరతునితోపాటు మేనమామ ఇంట ఉన్నాడు. తండ్రి దశరథుని మరణ వార్త తెలిసి వచ్చాడు. తండ్రి మరణానికీ అన్న అరణయ్య వాసానికీ ఎంతో దుఃఖించాడు.
శత్రుఘ్నునికి ఇద్దరు కొడుకులు. సుబాహుడు, శ్రుతసేనుడు.
లక్ష్మణుని మరణానంతరం రామునితో ఉన్నాడు శత్రుఘ్నుడు. ఆ తర్వాత రామునితో కలిసి సరయూ నదికి చేరి తనువు చాలించాడు.
విష్ణుమూర్తి ధరించిన శంకు చక్రాలే రాముడిగా పుట్టాక తోబుట్టువులై వెన్నంటి ఉన్నారు!
– బమ్మిడి జగదీశ్వరరావు
Bharatha,Lakshmana,Shatrugna,Sita Devi,Sri Rama
https://www.teluguglobal.com//2018/12/12/a-short-storyon-shatrugna-brother-of-sri-rama/