శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు గుడ్‌ న్యూస్‌

2024-12-06 02:34:58.0

శబరిమల యాత్రికుల సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్‌

https://www.teluguglobal.com/h-upload/2024/12/06/1383663-shabarimala-pilgrimage.webp

శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. మండలం-మకరవిళక్కు వార్షిక యాత్ర సందర్భంగా వస్తున్న వారికి సులభంగా దైవ దర్శనం కావడానికి వీలుగా ప్రత్యేక పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. ”Sabarimala – Police Guide” అనే ఈ పోర్టల్‌ ఇంగ్లీష్‌ భాషలో అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టల్‌లో భక్తులకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్నంతా పొందుపరిచారు. పోలీస్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు, పోలీస్‌ స్టేషన్‌ ఫోన్‌ నంబర్లు, హెల్త్‌ సర్వీసులు, కేఎస్‌ఆర్టీసీ, అంబులెన్స్‌, ఫైర్‌ స్టేషన్‌ సర్వీసెస్‌, ఫుడ్‌ సేఫ్టీ సమాచారం ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. వీటితోపాటు శబరిమల చరిత్ర, వాహనాల పార్కింగ్‌, ప్రతి జిల్లా నుంచి శబరిమలకు ఉన్న వాయు, రైలు, రోడ్డు మార్గాల వివరాలను ఇందులో పొందుపరిచినట్లు పోలీసు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 

To ease Sabarimala pilgrimage,For devotees,Police create portal,”Sabarimala – Police Guide”