2025-02-26 10:30:55.0
బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ శివలింగాలకు అభిషేకం చేశాడు.
మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ లిట్టన్ దాస్ శివలింగాలకు అభిషేకం చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలను తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా షేర్ చేశాడు. బంగ్లాదేశ్ హిందూ కుటుంబానికి చెందిన లిట్టన్ దాస్ మహా శివరాత్రి సందర్భంగా ఇలా ప్రత్యేకంగా శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న శివలింగాలకు పూజలు చేశాడు. కాగా, ఇటీవల బంగ్లాలో హిందువులపై జరిగిన దాడుల్లో ఆందోళనకారులు లిట్టన్ దాస్ ఇంటిని కూడా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
ఈ సంఘటన నుంచి తేరుకుని అతడు ఆలయానికి వెళ్లి శివలింగాలకు అభిషేకం చేసి ట్వీట్ చేయడంపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి క్రికెటర్ కేశవ్ మహారాజ్ కూడా శివరాత్రి సందర్భంగా తన ఇన్స్టా స్టోరీలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టాడు. అయినప్పటికీ ఆలయానికి వెళ్లి పూజలు చేసి ట్వీట్ చేయడంపై నెట్టింట ప్రశంసలోస్తున్నాయి.
Littan Das,Bangladesh cricketer,Maha Shivratri,Shivalingam,Cricketer Keshav Maharaj,Insta story,hindu,Shivalayam,ICCI,BCCI