శ్రావణ భాగ్యం

2023-08-30 07:48:36.0

https://www.teluguglobal.com/h-upload/2023/08/30/817588-sharada.webp

వచ్చిరదిగో

మా అక్కచెల్లెళ్ళు

తెచ్చారు చిన్ననాటి

కబుర్ల కావళ్ళు .

శ్రావణమిచ్చేను

పసుపుకుంకుమలూ

ఇచ్చుకునే వాయనాలు

చేసరాలూ

పున్నమి వెన్నెల్లు

చల్లని మమతలు

చలుకుని వెల్లువగ

ఆనంద సంద్రాలు

పిల్లపాపా బామ్మ తాతా

ఉల్లసిల్లగ

చెమ్కీల రాఖీల చేతులు

తళుకులీనగ

అక్క చక్కని నవ్వు

చెల్లి చిక్కని చూపు

నీకు నేనని నాకు నీవని

ముంజేతి కంకణమ్మై

మంచి మనుగడ

అందరికి కావాలన

జగమంతా విజ్ఞాన

విభలు దీపించాలని

వచ్చిరదిగో

మా అక్కచెల్లెళ్ళు

తెచ్చారు చిన్ననాటి

కబుర్ల కావళ్ళు .

– శారదా దామోదర్

Sravana Bhagyam,Sarada Damodar,Telugu Kavithalu