2024-09-28 10:45:39.0
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
https://www.teluguglobal.com/h-upload/2024/09/28/1364044-vande-bharath-metro.webp
శ్రీకాకుళం – వైజాగ్ మధ్య వందే మెట్రో (నమో భారత్) రైలు పరుగులు పెట్టనుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయకుడు నమో భారత్ మెట్రో రైలు నడిపించాలని కోరారు. వందే భారత్ కన్నా అధిక వేగంతో నడిచే నమో భారత్ రైళ్లను కేంద్రం ఇటీవలే తీసుకువచ్చింది. గుజరాత్ లోని భుజ్ – అహ్మదాబాద్ నమో భారత్ మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. శ్రీకాకుళం – వైజాగ్ మధ్య మొదట నమో భారత్ మెట్రో ప్రారంచాలని, తర్వాతి దశలో శ్రీకాకుళం – సికింద్రాబాద్, శ్రీకాకుళం – తిరుమతి మధ్య ఈ రైల్ సేవలు ఆరంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మెట్రో రైళ్లు గంటకు 130 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైళ్లో 1,150 మంది కూర్చొని, రెండు వేల మంది వరకు నిల్చుని ప్రయాణింవచ్చని రైల్వే శాఖ వర్గాలు చెప్తున్నాయి.