శ్రీనగర్‌ మార్కెట్‌లో గ్రెనేడ్‌ పేలుడు కలకలం

2024-11-03 10:11:39.0

ఈ ఘటనలో 12 మందికి గాయాలు.. ఎవరికీ ప్రాణాపాయం లేదన్న పోలీసులు

https://www.teluguglobal.com/h-upload/2024/11/03/1374498-granade-attack.webp

సెంట్రల్‌ కశ్మీర్‌ శ్రీనగర్‌ జిల్లాలో ఆదివారం మార్కెట్‌లో గ్రెనేడ్‌ పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది వరకు గాయపడ్డారు. సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్‌సీ సమీపంలో రద్దీగా ఉండే మార్కెట్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్‌ విసిరారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నది. అందరికీ స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. దాడి జరిగిన వెంటనే ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు మొత్తం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించడానికి దర్యాప్తు చేపట్టాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు. 

Grenade blast,Srinagar market,several injured,blast near TRC