శ్రీవారిని దర్శించుకున్న పవన్‌

2024-10-02 06:03:13.0

11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమణ

https://www.teluguglobal.com/h-upload/2024/10/02/1365283-pawan-at-tirumala.webp

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాయశ్చిత దీక్షను విరమించారు. ఆయనతో పాటు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందర్‌ సాయి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు పవన్‌కు స్వామి వారి ఫొటో, తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో పవన్‌ ఇటీవల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 11 రోజుల పాటు దీన్ని కొనాసాగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుమతి చేరుకున్న ఆయన అలిపిరి మెట్ల మార్గ నుంచి కాలినడకన తిరుమలకు వచ్చారు.

అంతకుముందు తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భగా ఆయన చిన్న కుమార్తె పొలెనా అంజనా కొణిదెల డిక్లరేషన్‌ ఇచ్చింది. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్‌ పత్రాలపై పవన్‌ సంతకం చేశారు. పొలెనా మైనర్‌ కావడంతో తండ్రిగా ఆయన సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.