శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

2025-01-01 14:02:46.0

తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నరు

నూతన సంవత్సరం పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రముఖులు క్యూ కట్టారు. జమ్మూ- కశ్మీర్ గవర్నర్ సిహెచ్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేరువేరుగా కుటుంబ సభ్యులతో ఇవాళ శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల దర్శనార్థం విచ్చేసిన వీఐపీలకు ఘన స్వాగతం ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి దర్శించుకోవడం చాలా సంతోషకరం గా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆయనతో టీటీడీ అధికారులు ముచ్చటించారు. అలాగే ఆలయ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం.. ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Deputy CM Bhatti Vikramarka,Srivari,Tirumala,TTD,TTD officials,TTD Chairman br naidu,Jammu and Kashmir Governor CH Manoj Sinha,TTD EO Shyamala rao,CM Chandrababu,CM Revanth reddy