2024-10-17 05:13:26.0
భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరికలతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు
https://www.teluguglobal.com/h-upload/2024/10/17/1369795-ttd.webp
భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరికలతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి మెట్టు కాలినడక మార్గాన్ని టీటీడీ మూసేసింది. కొండచరియలపై నిఘా పెట్టి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నది. భక్తుల దర్శనాలు, వసతికి ఇబ్బంది కలుగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు వాయుగుండం తీరం దాటాక వర్షాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.