2024-12-06 08:20:36.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/06/1383746-nag-family.webp
నూతన వధూవరులతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న కుటుంబసభ్యులు
ప్రముఖ సినీ నట్టుడు అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నది. ఇటీవల నాగచైతన్య, శోభిత వివాహం జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులతో కలిసి కుటుంబసభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. మొదట ఆలయ మహాద్వారం వద్ద వారికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.
Sri Bhramaramba Mallikarjuna Swamy,Nagarjuna,Naga chaitanya,Sobhita