శ్రేయస్‌ అయ్యర్‌కు రూ. 12లక్షల ఫైన్.. ఎందుకంటే?

https://www.teluguglobal.com/h-upload/2024/04/18/1320006-bcci-fines-kkrs-skipper-shreyas-iyer-12-lakh-for-slow-over-rate.webp

2024-04-18 01:32:54.0

ఈ సీజన్‌లో అయ్యర్ కంటే ముందు శుభ్‌మన్‌గిల్, రిషబ్‌పంత్, సంజూ శాంసన్ స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడింది. కాగా, రాజస్థాన్ చేతిలో 2 వికెట్ల తేడాతో కోల్‌కతా ఓడిపోయింది.

 

రాజస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించిన కారణంగా ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్‌కు ఫైన్ వేసినట్టు IPL నిర్వాహకులు వెల్లడించారు. తొలి తప్పిదం కావడంతో రూ. 12 లక్షలు జరిమానా విధించినట్టుగా తెలిపారు.

ఈ సీజన్‌లో అయ్యర్ కంటే ముందు శుభ్‌మన్‌గిల్, రిషబ్‌పంత్, సంజూ శాంసన్ స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడింది. కాగా, రాజస్థాన్ చేతిలో 2 వికెట్ల తేడాతో కోల్‌కతా ఓడిపోయింది. ఒక దశలో కేకేఆర్ విజయం సునాయాసమే అనిపించినా.. జోస్ బట్లర్ వీరోచిత పోరాటంతో ఓటమి తప్పలేదు. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా 4 విజయాలు, 2 ఓటములతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈనెల 21న బెంగళూరుతో కేకేఆర్‌ తలపడనుంది.