https://www.teluguglobal.com/h-upload/2024/11/07/1375682-sharukh-khan.webp
2024-11-07 11:33:41.0
బాలివుడ్ బాద్‌షాకు బెదిరింపులు
కృష్ణా జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతుండగానే మరో బాలివుడ్ దిగ్గజ హీరోను చంపేస్తామనే హెచ్చరికలు మొదలయ్యాయి. బాలివుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి. బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఈమేరకు కేసు నమోదు చేశారు. ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో ఉన్న సిమ్ కార్డ్ నుంచి షారూఖ్ ను చంపేస్తున్నామనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులు గుర్తించారు. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారూఖ్ చంపేస్తామని సదరు వ్యక్తి ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఫైజాన్ ఫోన్ ను ట్రాక్ చేయగా రాయ్ పూర్ లో ఉన్నట్టుగా గుర్తించారు. అతడిని వెదికేందుకు ముంబయి పోలీసుల బృందం రాయ్‌పూర్ కు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టింది.
Shahrukh Khan,Bollywood,Salman Khan,Bandra Police Station,Raipur,Threat Calls