ష్‌… ఇగం పెరిగింది!

2024-12-17 13:32:32.0

తెలంగాణలో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఇగం పెరిగింది. రాత్రి పూటనే కాదు పొద్దంతా కూడా ప్రజలు చలికి ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో చలిగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు పడిపోతాయని వెల్లడించింది. ఆదిలాబాద్‌, కొమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది.

Cold Waves,Temperatures Came Down,Telangana