2024-12-24 16:51:16.0
తర్వలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తామన్న మంత్రి పొంగులేటి
నూతన ఏడాదిలో ఇందిరమ్మ ఇల్ల నిర్మాణం ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వేలో వేగం పెరిగిందని, ఇప్పటివరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు. తర్వలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని పొంగులేటి చెప్పారు. జిల్లాకు ఒక ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామని మంత్రి పునరుద్ఘాటించారు.
హిమాయత్‌నగర్‌లని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి మొదటి వారానికి పూర్తవుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్‌ను తిరిగి బలోపేతం చేస్తున్నామన్నారు. వివిధ విభాగాల్లో ఉన్న కార్పొరేషన్ ఉద్యోగులను 95 శాతం వెనక్కి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడానికి అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చకుంటున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రకియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణాలపై త్వరలో విధివిధానాలు ప్రకటించనున్నట్లు పొంగులేటి చెప్పారు.
Revenue and Housing Minister Ponguleti Srinivasa Reddy,Start construction of houses by Sankranti Telangana Government,Receives 80L applications,Under Indiramma housing scheme.