సంక్రాంతి పండుగ వేళ.. 187 ఏఎస్‌ఐలకు ప్రమోషన్

2025-01-10 13:47:34.0

సంక్రాంతి పండుగ సమీపిస్తోన్న వేళ ఏఎస్‌ఐలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది

సంక్రాంతి పండుగ పూట తెలంగాణ ప్రభుత్వం పోలీసు ఏఎస్‌ఐలకు గుడ్ న్యూస్ చెప్పింది. 1989, 1990 బ్యాచ్‌కు చెందిన పోలీసులకు పదోన్నతి కల్పించింది.హైదరాబాద్ రీజియన్‌లోని 187 ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ఆదేశాలకు మేరకు ప్రమోషన్లు ఇస్తూ మల్టీ జోన్ – 2 ఐజీపీ సత్యనారాయణ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. ఆ 187 మంది ఏఎస్సైలు తాజాగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే వారికి పదోన్నత్తులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sankranthi,DGP Jitender,IGP Satyanarayana,CM Revanth reddy,Congress party,Telangana Police,CS Shanthikumari,1989,batch police