సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్‌ బోర్డు

2025-01-07 14:01:32.0

జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్‌ కాలేజీలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల

తెలంగాణ ఇంటర్‌ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్‌ కాలేజీలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. 17న తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపింది. అలా చేస్తే చర్యలు తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. 11న (రెండో శనివారం), 12 (ఆదివారం) కావడంతో మొత్తంగా ఆరు రోజుల పాటు సెలవులు లభించాయి. 

Telangana Inter Board,official order,Sankranti Holidays,Colleges reopen,Instructed