https://www.teluguglobal.com/h-upload/2024/12/13/1385446-drug.webp
2024-12-13 06:05:46.0
పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం
సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో అధికారులు ఈ సోదాలు చేశారు. డీఆర్‌ఐ, నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ బృందాలు ఇందులో పాల్గొన్నాయి. లారీలో తరలిస్తుండగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం. వీటిని ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి ముంబయి తరిలిస్తున్నట్లు గుర్తించారు.
Massive drug caught,Sangareddy district,DRI,Narcotic Drugs Control,Central Vigilance,Kakinada Port