సంజూ శాంసన్‌ దనాదన్‌ సెంచరీ

https://www.teluguglobal.com/h-upload/2024/10/12/1368467-sanju.webp

2024-10-12 14:57:42.0

40 బంతుల్లోనే వంద బాదేసిన సంజూ.. సూపర్‌ హాఫ్‌ సెంచరీ చేసిన సూర్య

 

బంగ్లాదేశ్ తో జరుగుతోన్న మూడో టీ20లో భారత ఓపెనర్‌ దనాదన్‌ ఇన్నింగ్స్‌ తో మెరుపులు మెరిపించారు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో విరుచుపడుతున్న శాంసన్‌ కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్‌ తో జత కలిసిన తర్వాత బంగ్లా బౌలర్లపై నిర్దయగా విరుచుపడ్డారు. శాంసన్‌, సూర్య దాటికి భారత జట్టు 13 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోయి 190 పరుగులు చేసింది. 47 బంతుల్లో 11 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో సంజూ శాంసన్‌ 111 పరగులు చేసి ముస్తఫిజుర్‌ బౌలింగ్‌ లో మెహదీ హసన్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యారు. 34 బంతుల్లో 5 సిక్సర్లు, 8 ఫోర్లతో సూర్యకుమార్ యాదవ్‌ 75 పరుగులు చేసి మహమ్మదుల్లా బౌలింగ్‌ లో రిషద్‌ హోస్సేన్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యారు. రియాన్‌ పరాగ్‌ 8 పరుగులతో , హార్థిక పాండ్యా పరుగులేమి చేయకుండా క్రీజ్‌ లో ఉన్నారు. టీమిండియా 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.