సంతోష్ ట్రోఫీ పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

2024-12-12 15:22:56.0

హైదరాబాద్‌లో ఈనెల 14నుంచి ప్రారంభం కానున్న సంతోష్ ట్రోఫీ పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు.

ఈనెల 14 నుండి హైదరాబాద్ నగరంలో ప్రారంభం కానున్న సంతోష్ ట్రోఫీని పురస్కరించుకుని రూపొందించిన పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరం చారిత్రాత్మకమైన ఫుట్ బాల్ క్రీడా ప్రతిష్టాత్మక టోర్నీ సంతోష్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. డిసెంబర్ 14 నుండి డిసెంబర్ 31 వరకు దాదాపు 37 వివిధ రాష్ట్రాల జట్లు పాల్గొంటున్న ఈ సంతోష్ ట్రోఫీ కి సంబంధించి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శివసేనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, రఘురాం రెడ్డి జీ వంశీ కృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.

CM Revanth Reddy,Santosh Trophy,Football tournament,Shiv Sena Reddy,Anil Kumar Yadav,Dr. Mallu Ravi,Chamala Kiran Kumar Reddy,Balram Naik