సంధ్య థియేటర్‌ ఘటన.. తప్పుడు పోస్టులపై పోలీసుల వార్నింగ్‌

2024-12-25 07:48:27.0

తొక్కిసలాట ఘటనపై సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారంతో పాటు ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని హచ్చరిక

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సోషల్‌ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం పోస్ట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాట ఘటనపై సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారంతో పాటు ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నటుడు అల్లు అర్జున్‌ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు తప్పుడు వీడియోలు పోస్టు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఘటనపై విచారణ క్రమంలో నిజాలను వీడియో రూపంలో పోలీస్‌ శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. ఉద్దేశపూర్వకంగా పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు పోస్టులు పెడితే తీవ్రంగా పరిగణిస్తాం. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే మాకు అందించవచ్చు అని నగర పోలీసులు పేర్కొన్నారు.

Hyderabad Police,Warn,Strict Action,On Sandhya Theatre Issue,Posts false information,videos,On social media