సంవాదం (కవిత)

2023-01-02 07:26:45.0

https://www.teluguglobal.com/h-upload/2023/01/02/433585-somvadham.webp

అతనడిగాడు

నేను ఇంగ్లిష్ ను ఎందుకు వ్యతిరేకిస్తానని

ఇంగ్లిషే నన్ను వ్యతిరేకిస్తుందని

జవాబిచ్చాను

మరి నీకు ఇంగ్లిష్ బాగా వచ్చుగదా

అన్నాడతను

చిరునవ్వు నవ్వాను

నా నవ్వుతోనే అతనికి అర్థమైంది

ఇంగ్లిష్ మాట్లాడుతున్నానంటే

నాకు నేనే వ్యతిరేకమని

అయితే నువ్వు రాజుకు కూడ వ్యతిరేకమేనా

అడిగాడతను

దానికి జవాబు సులభం

ఇక చాలు పోవోయ్

అని నన్ను నేను రక్షించుకోవచ్చు

కాని మర్యాద తెచ్చిపెట్టుకుని

నువ్వెంత అందంగా ఉన్నావు అన్నాను

విసిగిపోయి అతనన్నాడూ,

అయితే నువు ప్రతిదాన్నీ

ఎదిరిస్తావన్నమాట

బహుశా నువు కవివేమో…

హిందీ మూలం – లాల్టూ

తెలుగు: ఎన్ వేణుగోపాల్

N Venugopal,Sanvadam,Telugu Kavithalu