‘ఎక్స్’లో వెల్లడించిన లిటిల్ మాస్టర్
2024-12-04 10:39:00.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/04/1383246-sara-tendulkar-1.webp
దిగ్గజ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సచిన్ రమేశ్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ ఇండియా డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆమె ఫౌండేషన్ బాధ్యతలు స్వీకరించినందుకు తాను చాలా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. సారా యూనివర్సిటీ కాలేజీ లండన్ నుంచి క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారని వెల్లడించారు. క్రీడలు, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్‌లో భారతదేశం సాధికారత సాధించేందుకు కృషి చేస్తారని వెల్లడించారు. ఆయా రంగాల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యాలను మనవాళ్లు అందిపుచ్చుకోవడానికి పాటు పడతారని పేర్కొన్నారు.

STF India,Sachin Tendulkar,Sara Tendulkar,Sports,Education,Health Care