సత్య నాదెళ్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

2024-12-30 10:23:49.0

మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.

మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న స్కిల్‌ యూనివర్సిటీలో ప్రధాన భాగస్వామి కావాలని ఆయన్ని కోరేందుకే ప్రధానంగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను సత్య నాదెళ్లకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో మరిన్ని పెట్టుబడులను హైదరాబాద్‌లో పెట్టులని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రం మొదటి నుంచీ మైక్రోసాఫ్ట్‌కు సానుకూలంగా ఉంది. హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ సెంటర్‌లో సుమారు 4 వేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఇటీవల ఒప్పందాలు జరిగాయి. దీనికి సంబంధించిన పురోగతిపైనా సత్యనాదెళ్లతో చర్చించినట్లు తెలుస్తోంది 

CM Revanth Reddy,Satya Nadella,CEO of Microsoft,Minister Sridhar Babu,Chief Secretary Shantikumari,Hyderabad,Artificial Intelligence,Cloud Computing,Future City,AI City,Skill University,Telangana goverment,KTR