సనాతన ధర్మంపై కామెంట్స్‌: ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంలో ఊరట

2025-01-27 16:38:24.0

సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన మూడు రిట్‌ పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం

https://www.teluguglobal.com/h-upload/2025/01/27/1398119-uday-nidhi-stalin.webp

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మంపై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన మూడు రిట్‌ పిటిషన్లను విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద ఇవి ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించిన జస్టిస్‌ బేలా ఎం. త్రివేది, జస్టిస్‌ ప్రసన్న బి. వరాలేలతో కూడి ధర్మాసనం ఈ పిటిషన్లను తోసిపుచ్చింది.

సెప్టెంబర్‌ 2023లో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ… సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకం అన్నారు. అనంతరం తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు. అయినప్పటికీ హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఉదయనిధిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులోనూ పలు పిటిషనక్లు దాఖలయ్యాయి.

Supreme Court,Relief,To Udhayanidhi Stalin,In ‘Sanatana’ Comment Case