సప్తపదులు

2023-08-06 13:13:33.0

https://www.teluguglobal.com/h-upload/2023/08/06/806181-saptapadulu.webp

మాట

పాట

మది భావాలను పలికించే కవిత్వపు పూదోట.

2

అప్పు

సొప్పు

ఆశల వలయంలో చిక్కితే తప్పదు ముప్పు.

3

అండ

దండ

లేని శరణార్థులకు జీవితమే ఒక గుదిబండ.

4

సిద్ధి

బుద్ధి

సాధన తోనే మనిషి సాధించును అభివృద్ధి.

5

కోపాలు

తాపాలు

బంధాలను బలి చేసి మిగిల్చెను పశ్చాత్తాపాలు.

6

గాడి

దాడి

దారితప్పిన నైతిక విలువులకు కడుతుంది పాడి.

7

పద్యం

గద్యం

మదిని దోచే అక్షర తుణిరాల వాయిద్యం.

– జ్యోతి మువ్వల

( బెంగళూరు )

Saptapadulu,Jyoti Muvla