2025-02-04 07:05:10.0
అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ధ్వజం
శాససనభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేశారు. మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటి? క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదని ఎద్దేవా చేశారు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు? అని ప్రశ్నించారు.
షెడ్యూల్ ముందే ఖరారు చేసి ఎట్లా వాయిదా వేస్తారు?: వేముల ప్రశాంత్ రెడ్డి
దీనిపై మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..శాసన సభ ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడిందని, ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరగలేదన్నారు. సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా వేశారని, దీంతో తెలంగాణ రాష్ట్రం ,శాసన సభ పరువు పోయిందన్నారు. కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసన సభ ను వాయిదా వేస్తారా ? కేబినెట్ మీటింగ్ ,శాసన సభ సమావేశాల షెడ్యూల్ ముందే ఖరారు చేశారు. మళ్ళీ మార్పులు ఎందుకు చేశారని నిలదీశారు. ఒక్క నిమిషంలోనే సభ ను వాయిదా వేసుకోవడాన్ని బీఆర్ఎస్ ఎల్పీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
మొదట్నుంచి కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకమే: గంగుల
మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చే గౌరవం ఇదేనా ? బీసీ గణన పై చర్చ అని వాయిదా వేస్తారా ? కాబినెట్ ముందు పెట్టకుండానే నిన్న కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టారు ?ప్రశ్నలు ఏకరువు పెట్టారు.బీసీ లను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. మొదట్నుంచి కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకమే. మా జీవితం లో ఈ తరహా లో అసెంబ్లీ ని చూడాలేదన్నారు. బీసీ గణన తప్పుల తడకగా ఉందని ధ్వజమెత్తారు.
బీసీల కోసం మరో ఉద్యమం: తలసాని
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ లో నూటికి తొంభై శాతం బడుగు ,బలహీన వర్గాలు ,దళితులు ,గిరిజనులు ,మైనారిటీ లే ఉన్నారు. ఈ రోజు అసెంబ్లీ లో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. షెడ్యూల్ ఇచ్చి మాట తప్పుతారా ? కేబినెట్ సమావేశం నిన్న పెట్టుకుంటే ఏమయ్యేది ? అని ప్రశ్నించారు. మమ్మల్ని సభకు పిలిచి అవమానించారని మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు చెప్పగానే ఒక్క నిమిషం లో సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ ను వాయిదా వేసే ముందు స్పీకర్ మమ్మల్ని అడగరా ? సభ ను వాయిదా వేయడం కుట్ర పూరితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ను ఒక రోజే నిర్వహించడం అన్యాయమన్నారు. నాలుగు రోజులు అయినా సభ పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. బీసీ లు చైతన్యవంతులు కేసీఆర్ ఏం చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తున్నారు. బీసీ ల కోసం మరో ఉద్యమం రాబోతున్నదని, తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఈ ఉద్యమం ఉండబోతున్నదని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ విప్‌లను నియమించిన కేసీఆర్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ విప్‌లను నియమించారు. మండలిలో విప్‌గా సత్యవతి రాథోడ్, శాసనసభలో విప్‌గా వివేకానంద గౌడ్‌లను నియమించారు. కేసీఆర్ నిర్ణయాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు తెలిపారు.
Telangana Legislative Assembly,Adjourned,Due to Cabinmate meeting,Harish Rao,Prashant Reddy,Talasani Srinivas Yadav,Fire On Congress Govt,Caste Census,Classification of SC,Reports Introduced Assembly