2025-01-29 11:02:29.0
తెలంగాణలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే దేశ దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలంగాణలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే దేశ దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులగణన పూర్తవ్వడంపై ఇవాళ ఆయన మంత్రులు అధికారులతో సమీక్షించారు. సర్వేపై జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయనిన్నారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. కాగా సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమయిందని.. ఒకటి రెండు రోజుల్లో సమర్పిస్తామని అధికారులు వివరించారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని ముఖ్యమంత్రికు వివరించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడడంతో కుల గణన సర్వే నివేదిక కీలకమైంది. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1 నాటికి ఏడాది పూర్తి అవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఆలోచన చేస్తోంది. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇప్పటికే కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. కులగణన సర్వే నివేదిక కూడా అందగానే రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
CM Revanth reddy,Census,Local body elections,BC Dedication Commission,BC Reservations,Telangana goverment,CS Shanthikumari,Cabinet Sub Committee