సమ్మర్‌‌లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..

https://www.teluguglobal.com/h-upload/2023/02/23/500x300_724250-food.webp
2023-02-23 10:00:37.0

సమ్మర్‌‌లో ఇమ్యూనిటీ కోసం డ్రైఫ్రూట్స్, నట్స్ ఆకు కూరలను డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తింటుండాలి.

మిగతా సీజన్లతో పోలిస్తే సమ్మర్‌‌లో కొంచెం ఎక్కువ హెల్త్ కేర్ తీసుకోవాలి. వాతావరణంలోని వేడి వల్ల సమ్మర్‌‌లో స్కిన్ సమస్యల నుంచి జీర్ణ సమస్యల వరకూ రకరకాల అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి. సమ్మర్‌‌లో హెల్దీగా ఉండేందుకు ఎలాంటి డైట్ తీసుకోవాలంటే..

సమ్మర్‌‌లో వేడికి శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది. శరీరంలో తగినంత నీరు లేకపోతే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే శరీరంలోని ఎలక్ర్టోలైట్స్‌ లెవల్స్‌లో కూడా మార్పులు రావొచ్చు. సమ్మర్‌‌లో శరీరంలో తగినంత శక్తి లేకపోతే ఎండ ధాటికి వడదెబ్బ కూడా తగలొచ్చు. అంతేకాదు సమ్మర్‌‌లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే సమ్మర్‌‌లో స్పెషల్ హెల్త్ కేర్ తీసుకోవాలి.

సమ్మర్‌‌లో బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఆహారంలో విటమిన్‌–సీ చేర్చుకోవాలి. దీనీకోసం రోజూ నిమ్మ, జామ, ద్రాక్ష, ఆరెంజ్ వంటి సిట్రస్‌ పండ్లు తీసుకోవాలి.

సమ్మర్‌‌లో ఇమ్యూనిటీ కోసం డ్రైఫ్రూట్స్, నట్స్ ఆకు కూరలను డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తింటుండాలి.

సమ్మర్‌‌లో శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు బొప్పాయి, పుచ్చకాయ, కర్భూజా లాంటి పండ్లు, టొమాటో, కీరా, దోసకాయ లాంటి కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

సమ్మర్‌‌లో విటమిన్–డి డెఫీషియన్సీ రాకుండా ఉండాలంటే ఎండ తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో అటూ ఇటూ తిరగాలి. అలాగే విటమిన్–డి కోసం అప్పుడప్పుడు చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు వంటివి కూడా తీసుకుంటుండాలి.

సమ్మర్‌‌లో జీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు రోజూ పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకోవాలి. వీటిలో ఉండే ప్రోబ్యాక్టీరియా జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. వీటితో పాటు సమ్మర్‌‌లో నీళ్లు ఎక్కువగా తాగడం, వేగించిన ఫుడ్స్‌కు దూరంగా ఉండడం వల్ల మరింత హెల్దీగా ఉండొచ్చు.

Summer,Food,Health Tips
summer, food to eat in summer season, food to eat in summer, food, eat, summer, summer tips, summer news, summer health, telugu news, telugu global news, latest telugu news, summer food

https://www.teluguglobal.com//health-life-style/what-kind-of-food-to-eat-in-summer-894029