https://www.teluguglobal.com/h-upload/2024/03/03/500x300_1302843-walking-in-summer.webp
2024-03-03 08:57:49.0
మరీ ఎండ ఎక్కువ అయినప్పుడు కాకుండా తెల్లవారు జామున వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు.
వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నడక అనేది చాలా సులభమైన వ్యాయామం. ఏ వయస్సు వారైనా.. ఎలాంటి వర్క్‌అవుట్ చేయకపోయినా సులభంగా వాకింగ్ చేయొచ్చు. మనలో చాలా మంది ఉదయం లేదా సాయంత్రం కచ్చితంగా వాకింగ్ చేస్తుంటారు. భారీ వ్యాయామాలు కాకుండా, నడకవంటి లైట్ ఎక్సర్‌సైజ్‌లను వైద్యులు కూడా అందరికీ సూచిస్తుంటారు. హృద్రోగాలు, ఊబకాయం వంటి ఎన్నో సమస్యలకు వాకింగ్ పరిష్కారంగా చెప్పొచ్చు. డైలీ నడక మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే సీజన్ ను బట్టి వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. ముఖ్యంగా సమ్మర్ లో జిమ్ లకు వెళ్లేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు కొన్నిజాగ్రత్తలు పాటించాలి.
సాధారణంగా ఉదయంపూట లేవగానే బ్రష్ చేసుకుని, నీళ్లు తాగి వాకింగ్ ను ప్రారంభిచాలి. కానీ కొందరు నీళ్లు తాగకుండానే వాకింగ్ కు వెళ్తారు. దీంతో శరీరం అంతా డీహైడ్రేషన్ కు గురౌతుంది. ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
నడకకు ముందు వార్మ్‌అప్ చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. వార్మ్‌అప్ చేయకుండా నడవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వార్మ్‌అప్.. మీ గుండె, కీళ్లు , కండరాలను వాకింగ్ కు సిద్ధం చేస్తుంది. కొద్దీ నిమిషాల డైనమిక్ స్ట్రెచింగ్, లైట్ కార్డియోలతో నడకతో ప్రారంభించండి.
మరీ ఎండ ఎక్కువ అయినప్పుడు కాకుండా తెల్లవారు జామున వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు. లేదంటే సాయంత్రం ఎండ తక్కువ అయిన తర్వాత వాకింగ్ చేయడం బెటర్ అని అంటున్నారు.
కొందరు ఉదయం పూట వాకింగ్ కు అరటిపళ్ళు , మొలకలు తింటారు. బనానా ను ఖాళీ పోట్టతో అస్సలు తినకూడదు. అలాగే మొలకలు కూడా వాకింగ్ కి ముంది ఎక్కువగా తినడం మంచికాదు.
ఇక ఎండ ఎక్కువగా ఉన్న చోట కాకుండా కాస్త నీడ పట్టున వాకింగ్ చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పార్కుల్లో చెట్టు నీడలో వాకింగ్ చేయడం బెస్ట్ ఆప్షన్‌గా చెబుతున్నారు.
ఇక సమ్మర్‌లో వాకింగ్ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ వంటి డార్క్ కలర్ దుస్తులను ధరించకూడదు. వీలైనంత వరకు వైట్ కలర్ డ్రస్‌లను వేసుకోవాలి. దీనివల్ల ఎండ తీవ్రత శరీరంపై పడకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. బ్లాక్ వంటి దుస్తులు వేడిని ఆకర్షించుకుంటాయి. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి.
ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ ను తప్పనిసరిగా పెట్టుకొవాలి. జాగింగ్ చేసేటప్పుడు శరీరానికి కాస్తంత విరామం ఇవ్వాలి. నడక తర్వాత, కొన్ని స్ట్రెచింగ్ కూడా చేయాలి. అవి కండరాల నొప్పిని తగ్గిస్తాయి.
Summer,Walking,Temperatures,Health Benefits,Precautions,Walking in Summer
summer, Tips for Walking in Hot Temperatures, Health benefits, Health benefits of walking, Precautions, Telugu News, Telugu Global News, Telugu HealthTips
https://www.teluguglobal.com//health-life-style/summer-walking-tips-precautions-are-a-must-while-going-for-a-walk-in-summer-1006772