https://www.teluguglobal.com/h-upload/2024/03/10/500x300_1305043-exercise-in-summer.webp
2024-03-10 07:17:48.0
సమ్మర్‌లో శరీర ఉష్ణోగ్రతలు, బయటి ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా రోజువారీ వ్యాయామం చేసేవాళ్లు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సమ్మర్‌లో వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటే.
సమ్మర్‌లో శరీర ఉష్ణోగ్రతలు, బయటి ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా రోజువారీ వ్యాయామం చేసేవాళ్లు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సమ్మర్‌లో వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటే..
వేసవిలో వ్యాయామాలు చేసేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం అవసరం ఎందుకంటే.. సమ్మర్‌లో వేడి కారణంగా మామూలుగానే ఎక్కువ చెమట పడుతుంటుంది. దీనికితోడు వ్యాయామం కూడా చేయడం మూలంగా చెమట పట్టే ప్రక్రియ మరింత ఎక్కువవుతుంది. చెమట ఎక్కువగా బయటకు పోవడం వల్ల శరీరంలోని మలినాలతో పాటు నీరు, మినరల్స్ కూడా లాస్ అవుతారు. కాబట్టి సమ్మర్‌లో చెమట మరీ ఎక్కువ పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వేసవిలో ఎండ మొదలవ్వక ముందే వ్యాయామాన్ని ముగించాలి. అంటే ఉదయం 10 గంటల లోపే వ్యాయామం చేసేయాలి. అలాగే ఈవెనింగ్ వర్కవుట్స్ చేసేవాళ్లు సాయత్రం 5 గంటల తర్వాత ప్లాన్ చేసుకోవాలి.
సమ్మర్‌లో వ్యాయామం చేసేటప్పుడు చెమటను పీల్చే కాటన్ బట్టలు ధరిస్తే మంచిది. వ్యాయామానికి అరగంట ముందు మంచి నీళ్లు లేదా నిమ్మరసం వంటివి తీసుకోవాలి. అలాగే వ్యాయామం తర్వాత కూడా నీళ్లు లేదా ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
మిగతా సీజన్లతో పోలిస్తే సమ్మర్‌లో శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు వెళ్తుంది. కాబట్టి సమ్మర్‌లో మరింత త్వరగా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే వ్యాయామాలు చేసేవాళ్లు రోజు మొత్తం హైడ్రేటెడ్‌గా ఉంటున్నారో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా జిమ్ వర్కవుట్లు చేసేవాళ్లు ఈ సీజన్‌లో మరింత హైడ్రేటెడ్‌గా ఉండాలి. శరీరంలో ఎలక్రొలైట్స్ భర్తీ అయ్యేలా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటివి కూడా తరచూ తాగుతుండాలి.
సమ్మర్‌లో వ్యాయామం చేసేముందు వాతావరణం ఎలా ఉందో చూసుకోవాలి. బయట వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే వ్యాయామం చేస్తున్నప్పుడు తలనొప్పి, కళ్లుతిరిగినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోవాలి.
Exercise,summer,mistakes,Exercise in Summer
Exercise, summer, mistakes, Exercise in Summer, Health, Health Tips, Telugu News, Telugu Global News, Latest Telugu news
https://www.teluguglobal.com//health-life-style/exercise-in-summer-dont-make-these-mistakes-1009200