https://www.teluguglobal.com/h-upload/2024/03/19/500x300_1308078-juices.webp
2024-03-19 14:06:27.0
ఈ వేసవి కాలంలో ఎండల తాపం నుంచి బయటపడడం కోసం, శరీరాన్ని చల్లపరచడం కోసం, శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుకోవడం కోసం తీసుకోవలసిన పానీయాల గురించి తెలుసుకుందాం.
ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్తే.. కాసేపటికే అలసిపోతున్నారు. వేసవి వేడి ఒంట్లో మంట మండిచేస్తోంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. అధిక వేడి డీహైడ్రేట్ చేస్తుంది. కాబట్టి పుష్కలంగా నీరు తాగడం ద్వారా మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. నీటితో పాటు కడుపుని చల్లబరిచేందుకు పండ్లు , కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం కూడా ముఖ్యం.ఈ వేసవి కాలంలో ఎండల తాపం నుంచి బయటపడడం కోసం, శరీరాన్ని చల్లపరచడం కోసం, శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుకోవడం కోసం తీసుకోవలసిన పానీయాల గురించి తెలుసుకుందాం.
వీటిలో మొదటిది మజ్జిగ. ఇది అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయ భారతీయ పానీయం, వేసవిలో మజ్జిగను మించింది లేదు. శరీర తాపం తగ్గించడమే కాకుండా చలవ చేసే అద్భుతమైన డ్రింక్. జీర్ణక్రియలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా కేలరీలు తక్కువగా ఉండి..కాల్షియం, పొటాషియం, విటమిన్ బి12 అధికంగా ఉంటాయి. ప్రోబయోటిక్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి.
వేసవిలో దాహం తీర్చేందుకు అద్భుతంగా ఉపయోగపడే డ్రింక్ లెమన్ వాటర్. శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.
కొబ్బరి నీళ్లను సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్ డ్రింక్‌గా చెప్పవచ్చు. కొబ్బరి నీళ్లతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. శరీరంలోని లిక్విడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో తక్కువ కేలరీలు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

ఈ సీజన్‌లో సబ్జా వాటర్ తాగితే.. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. సబ్జా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఓమెగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ నీళ్లు తాగితే.. కడుపు మంట, ఉబ్బరం, అజీర్తి సమస్యలు దూరమవుతాయి. సబ్జాను స్మూతీస్, షేక్స్, ఫలూడాలో కూడా వేసుకుని తీసుకోవచ్చు.

బత్తాయి, నారింజ రసం ఒక రిఫ్రెష్ పానీయం, ఇది శరీరాన్ని చల్లబరచడానికి మరియు విటమిన్ సిని అందించడానికి సహాయపడుతుంది.
అలాగే బార్లీ నీరు, మెంతి నీరు, సోంపు వాటర్ కూడా శరీరాన్ని చల్లబరచడంతో పాటు జీర్ణక్రియకు దోహదపడతాయి.
Drinks,Summer,Health Benefits
Drinks, Summer, Summer 2024, Body Cool in Summer, Perfect Drinks, health benefits, health, weather, updates, news, telugu global news, telugu global health news, health tips telugu
https://www.teluguglobal.com//health-life-style/5-perfect-drinks-to-keep-your-body-cool-in-summer-1012462