సమ్మర్‌లో సబ్జా నీళ్లు ఎందుకు తాగాలంటే

https://www.teluguglobal.com/h-upload/2024/04/12/500x300_1318586-sabja-seeds.webp
2024-04-13 06:18:03.0

సమ్మర్‌‌లో శరీరంలోని వేడిని తగ్గించే వాటిలో సబ్జా ముందువరుసలో ఉంటుంది. కేవలం శరీరాన్ని చల్లబరచడమే కాదు, సబ్జా గింజలతో మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

సమ్మర్‌‌లో శరీరంలోని వేడిని తగ్గించే వాటిలో సబ్జా ముందువరుసలో ఉంటుంది. కేవలం శరీరాన్ని చల్లబరచడమే కాదు, సబ్జా గింజలతో మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సబ్జా గింజల్లో ఎక్కువమొత్తంలో మినరల్స్, ఫైబర్, ప్లాంట్ కాంపౌడ్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఓవరాల్ హెల్త్‌ను మెరుగుపరచడంతో పాటు శరీర మెటబాలిజాన్ని పెంచుతాయి.

సమ్మర్‌‌లో ప్రతిరోజూ సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి కూల్ అవ్వడంతోపాటు శరీరంలోని వాటర్ లెవల్స్ పడిపోకుండా ఉంటాయి.

సబ్జా గింజల్లో ఉండే ఫోలేట్, నియాసిన్, విటమిన్–ఇ వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్.. సమ్మర్‌‌లో స్కిన్ పాడవ్వకుండా కాపాడతాయి. అలాగే ఇందులో ఉండే ప్రొటీన్స్ వల్ల సమ్మర్‌‌లో జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

సబ్జా గింజల్లో ఉండే ఐరన్, క్యాల్షియం కంటెంట్ వల్ల మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజూ సబ్జా నీళ్లు తాగడం వల్ల రక్తహీనత, కీళ్ల బలహీనత తగ్గుతాయి.

సబ్జాలో ఉండే ఫైబర్ కంటెంట్ తక్షణ ఎనర్జీ లభిస్తుంది. సమ్మర్‌‌లో అలసిపోకుండా ఉండేందుకు సబ్జా నీళ్లు తాగొచ్చు.

సమ్మర్‌‌లో పిల్లలకు రోజూ సబ్జా నీళ్లు ఇవ్వడం ద్వారా వారికి డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే పిల్లల్లో సాధారణంగా వచ్చే చర్మ సమస్యలను కూడా నిరోధించొచ్చు.

సబ్జా గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా సబ్జా నీళ్లు మేలు చేస్తాయి.

Health Benefits,sabja seeds,summer
Health Benefits, sabja seeds, summers, sabja seeds water, seeds water for Health, telugu news, telugu global news, health news, health tips, health telugu news, telugu tips

https://www.teluguglobal.com//health-life-style/health-benefits-of-drinking-sabja-seeds-water-in-summer-1020289