సర్పంచులు, ఎంపీటీసీల పెండింగ్‌ బిల్లుల విడుదలపై యోచిస్తున్నాం

2024-12-24 16:12:29.0

పెండింగ్‌ బిల్లులకు సంబంధించిన అంశాలపై డిప్యూటీ సీఎం ప్రకటన విడుదల

సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పెండింగ్‌ బిల్లుల విడుదలకు ఆలోచన చేస్తున్నామని, ఈ విషయంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పెండింగ్‌ బిల్లులకు సంబంధించిన అంశాలపై డిప్యూటీ సీఎం ప్రకటన విడుదల చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు సుమారు రూ. 1,300 కోట్ల వరకు ఉన్నాయన్నారు. అందులో రూ. 10 లక్షల లోపు ఉన్న బకాయిల విలువ సుమారు రూ. 400 కోట్లు ఉన్నట్లు చెప్పారు. మొదటగా రూ. 10 లక్షల లోపు ఉన్న పెండింగ్‌ బిల్లులను విడుదల చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు భట్టి పేర్కొన్నారు. సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్‌రెడ్డితోపాటు తాను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ పెద్దలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులతో పనులు చేయించి బిల్లులు పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. ఇందుకు కారణమైన బీఆర్‌ఎస్‌ నేతలే పెండింగ్‌ బిల్లుల కోసం రోడ్లపైకి వస్తాం, ధర్నాలు చేస్తామని ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

Deputy Cm Batti vikramarka,Announced,Planning to release,Pending bills,Sarpanchus,MPTCs,BRS,Congress,CM Revanth Reddy